ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్ఓసీ అందజేత

ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్ఓసీ అందజేత
భవానిపురం, ఆంధ్రప్రభ: ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్)ను ప్రజాదర్బార్లో కూటమి నేతలు అందజేశారు.
44వ డివిజన్ నాలుగు స్తంభాల సెంటర్కు చెందిన ధనాలకోట రమ్య (38) హెర్నియా వ్యాధితో బాధపడుతూ వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమెకు మంజూరైన రూ.3 లక్షల ఎల్ఓసీని బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు.
త్వరితగతిన స్పందించి ఎల్ఓసీ అందజేయడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరికు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో 44వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాసరావు, 39వ డివిజన్ జనసేన అధ్యక్షుడు ఏలూరు సాయి శరత్, తెలుగు యువత నాయకుడు దాడి మురళీ కృష్ణ, ఎస్ఐ పీ శివ, పశ్చిమ చిరంజీవి యువత అధ్యక్షుడు షేక్ మధు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
