ఈనెల 27, 28 తేదీలలో తెలుగుదేశం పార్టీ మహానాడు

ఈనెల 27, 28 తేదీలలో తెలుగుదేశం పార్టీ మహానాడు
పాయకాపురం, ఆంధ్ర ప్రభ:
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు కార్యాలయంలో ఈనెల 27, 28 తేదీలలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంపై ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇన్‌చార్జులు, డివిజన్ నాయకులతో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విస్తృత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, కార్యకర్తలకు కల్పించాల్సిన సౌకర్యాలు, క్లస్టర్ స్థాయిలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు.
