వేంసూరు యువజన క్రీడోత్సవాలు

వేంసూరు యువజన క్రీడోత్సవాలు

  • 2కే రన్, కొరవడిన ప్రజల భాగస్వామ్యం

వేంసూరు, ఆంధ్రప్రభ : యువజన క్రీడల వారోత్సవాలలో భాగంగా సోమవారం వివిధ శాఖల అధికారులు 2కే మారథాన్ నిర్వహించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బోధిసత్వ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి మారథాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాణిక్ రావు, ఎంపిడిఓ కావ్య మాట్లాడుతూ నేటి నుంచి 23వ తేదీ వరకు యువజన క్రీడల వారోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది అన్నారు.

కొన్ని మండల స్థాయిలో, మరి కొన్ని జిల్లా స్థాయిలో కార్యక్రమాలు ఉంటాయన్నారు. 19న కెరియర్ నైపుణ్యాభివృద్ధి, 20న నాయకత్వ లక్షణాలు, యువత వినూత్న ఆలోచనలు 21న క్రీడా డే, 22న క్లీన్ తెలంగాణ, స్వచ్ఛ క్రీడా మైదానాలు 23న సీఎం కప్ విజేతలకు బహుమతులు వారోత్సవ కార్యక్రమంలో ఉంటాయన్నారు.

కానరాని ప్రజల భాగస్వామ్యం..

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యువజన వారోత్సవాలు నిర్వహించాలని పిలుపునిస్తే, నేడు మండలంలో జరిగిన 2కే రన్ ప్రజల భాగస్వామ్యం లేక బోసిపోయింది. ఇద్దరు అధికారులు, మరో నలుగురు ఉద్యోగులు, పంచాయతీ సిబ్బంది, ఒకరిద్దరు వార్డు సభ్యులు, మరో నలుగురు ప్రజలతో తూతూ మంత్రంగా నిర్వహించారని ఆరోపణలు వినవస్తున్నాయి. యువజన ఉత్సవంలో యువకులు లేకపోవటం పలు విమర్శలకు కారణం అయ్యాయి.