దమ్మపేటలో దొంగ నోట్ల కలకలం..

దమ్మపేటలో దొంగ నోట్ల కలకలం..

దమ్మపేట, ఆంధ్రప్రభ : దమ్మపేట మండల పరిధిలోని లచ్చాపురం గ్రామ శివారు చెరువు వద్ద దొంగనోట్లు పడవేసిన సంఘటన మండలంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే లచ్చాపురం గ్రామ శివారు చెరువువద్ద గుర్తు తెలియని వ్యక్తులు దొంగనోట్లు పడవేశారన్న విశ్వసనీయ సమాచారంతో దమ్మపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ నోట్లను స్వాధీనపరుచుకున్నారు.

వాటిని పరిశీలించగా అవి చిన్న పిల్లలు ఆడుకునే చాక్లేట్ నోట్లుగా గుర్తించారు. ఎవరో గుర్తు తెలియని ఆకతాయిలు ఈ విధంగా చేసుంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆకతాయి చర్యలకు పాల్పడిన వారిని కనిపెట్టి చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తెలిపారు .

Leave a Reply