పొట్టి శ్రీరాములు పుట్టిన జాతినాది సాధించే వరకు వదలను
- వెలంపల్లి శ్రీనివాస్
కేదారేశ్వరపేట, ఆంద్రప్రభ: డిఎస్సీ పేపర్లీకేజీపై వెంటనే సీబీఐతో ధర్యప్తు చేయించి దోషులను కఠినంగా శిక్షించాలని మాజి మంత్రి, వైఎస్సార్సీపీ పశ్చిమ నియోజక వర్గ ఇఛ్చార్జి వెలంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో 35వడివిజన్ అంబెద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఎస్సీ అవకతవకలపై విచారణ కోరుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహారిస్తుందన్నారు.
దీనికి భాధ్యుడైన మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామ చేయాలన్నారు. విద్యార్థుల భవిషత్తు కోసం పొరాడుతున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై ఎమ్మెల్యే బోండా ఉమా గూండాలు దాడి చేయటం అమానుషమన్నారు. తనపై అసభ్య పదజాలం వాడారని బోండా ఉమా బెదిరింపులకు దడవనన్నారు. పొట్టి శ్రీరాములు పుట్టిన జాతిలో తాను పుట్టానని సమస్య తీరేవరకు పొరాటం సాగిస్తానన్నారు. ఎన్నికలకు ముందు యువతకు నిరుద్యోగ బృతి కల్పిస్తామని, యువతకు ఉపాది అవకాశాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు రెండు సంవత్సరాలు దాటుతున్న నేడు వాటిని మర్చి పొవటం సిగ్గుచేటన్నారు.
వెంటనే నారాలోకేష్ తన పదవికి రాజీనామ చేయాలని డిమిండ్ చేశారు. రిలే నిరాహార దీక్షలో వైసీపీ నాయకులుమాజీ మేయర్ రాయల భాగ్యలక్ష్మి. రూహుల్లా. బండి నాగేంద్ర పుణ్యశీల. ఆసిఫ్. గౌస్ మహుద్దీన్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
