విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వరుసగా మూడు రోజుల సెలవులు

హైదరాబాద్, ఆంధ్రప్రభ : బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 10 (సోమవారం)ను సాధారణ సెలవుగా ప్రకటించింది. దీంతో రెండో శనివారం (ఆగస్టు 8), ఆదివారం (ఆగస్టు 9), బోనాల సెలవు (ఆగస్టు 10) కలిపి రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలకు వరుసగా మూడు రోజుల విరామం లభించనుంది.

అయితే ఇటీవల భారీ వర్షాల కారణంగా అదనపు సెలవులు ప్రకటించిన కొన్ని పాఠశాలలు మాత్రం కోల్పోయిన బోధనా దినాలను భర్తీ చేసేందుకు శనివారం (ఆగస్టు 8) యథావిధిగా తరగతులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

మరోవైపు, ప్రభుత్వం చేపడుతున్న ‘సర్’ విధుల్లో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సెలవు వర్తించదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఆగస్టు 10లోపు సర్వే డేటా సమర్పించాల్సి ఉండటంతో సంబంధిత సిబ్బంది విధుల్లోనే కొనసాగాల్సి ఉంటుంది.

ఆగస్టులో ప్రధాన ప్రభుత్వ సెలవులు
ఆగస్టు 10 – బోనాల పండుగ
ఆగస్టు 15 – స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 26 – ఈద్ మిలాద్-ఉన్-నబీ