ప్రజలతో హుందాగా వ్యవహరించాలి!

  • ప్రజలకు సేవలన్నీ పారదర్శకంగా అందించాలి
  • ఉద్యోగులంతా ప్రజలలో సానుకూల స్పందన పెంచేందుకు ప్రయత్నించాలి
  • జిల్లా రవాణా శాఖ అధికారి శివారెడ్డి

నంద్యాల నూనెపల్లె, ఆంధ్రప్రభ: కార్యాలయానికి వచ్చే ప్రజలతో రవాణా శాఖ అధికారులు, సిబ్బంది హుందాగా వ్యవహరించాలని జిల్లా రవాణా శాఖ అధికారి శివారెడ్డి అన్నారు. శుక్రవారం కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందించే రవాణా సేవల్లో అత్యంత పారదర్శకంగా సేవలందించాలన్నారు. కార్యాలయంలో అవినీతికి తావు లేకుండా, ఏ రోజుకు సంబంధించిన పనిని ఆరోజు పూర్తి చేయాలన్నారు. ప్రజల సంతృప్తి స్థాయిని పెంపొంచేందుకు వారికి అందించాల్సిన సేవల్లో ఎలాంటి జాడ్యం లేకుండా చూడాలన్నారు. ముఖ్యంగా కార్యాలయంలో ఎక్కడ అవినీతికి తావు లేకుండా చూడాలని వెహికిల్ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన సేవలందించాలి.

కార్యాలయానికి వచ్చే ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశించారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి చెల్లించే రుసుము తప్ప ఒక్క రూపాయి కూడా అధికంగా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ఐవీఆర్ఎస్ లో అధికారులకు సానుకూలంగా స్పందించాలని, తమ సంతృప్తిని తెలియజేలాయన్నారు. కార్యక్రమంలో వెహికల్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది ఉన్నారు.