రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి: సీపీఎం

బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలో రైతుల నుంచి అదనపు తూకం (42 కిలోలు) వేసేలా ఒత్తిడి తెస్తున్న రైస్ మిల్లర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. మంచి ధాన్యానికీ బి గ్రేడ్ కింద కొనుగోలు చేసి రైతులను నష్టపరుస్తున్నారని, లారీ కొరత పేరుతో కొనుగోళ్లు ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. నెలరోజులుగా ధాన్యం అమ్ముడు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైస్ మిల్లర్లు, ఐకేపీ అధికారులపై చర్యలు తీసుకుని, యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేసారు. కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు బొమ్మిడి సాయికృష్ణ, సంఘ ఎల్లయ్య, బొనగిరి లింగం, బండి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply