ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పనుల పరిశీలన…

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పనుల పరిశీలన…
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలంలోని కొనాపూర్ గ్రామ పంచాయతీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ బుధవారం సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో వాటర్ ట్యాంకుల క్లోరినేషన్, ఇందిరమ్మ ఇళ్ల ప్రగతి, ఉపాధి హామీ పనులను పరిశీలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నవీన్, టిఏ అరవింద్, ఫీల్డ్ అసిస్టెంట్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

