రాజుకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

రాజుకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

కృత్తివెన్ను, ఆంధ్రప్రభ : మండలం నిడమర్రు గ్రామంలో ఎంతోకాలంగా పేద ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తూ పేద ప్రజల ప్రేమ అనురాగాలు సంపాదించుకొన్న డా.తిరుమని రాజు కొద్దిరోజుల క్రితం అకాల మరణం చెందడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్న పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ అక్కడ ఉన్నటువంటి నాయకులకు ఆ కుటుంబానికి అండగా నిలవాలని కోరగా, కృత్తివెన్ను మండల , గ్రామంలోని నాయకులు కార్యకర్తలు ఒక్కటై పెద్దకర్మ చేయడం జరిగింది. ఐదు లక్షల రూపాయలను పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ మరియు నాయకులు కార్యకర్తలు ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది.