మురికి కాల్వలు శుభ్రం చేసిన పంచాయతీ కార్యదర్శి..

బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని కాచాపూర్ గ్రామ సచివాలయ కార్యదర్శి రాజు గ్రామంలో గల పలు మురికి కాల్వలను శుభ్రం చేశారు .శుక్రవారం గ్రామపంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన అక్కడికి వెళ్లి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం పంచాయతీ సిబ్బందితో పాటు కార్యదర్శి మురికి కాలువలను శుభ్రం చేసి పిచ్చి మొక్కలను తొలగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిసర ప్రాంతాలను ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వర్షాకాలంలో మురికి నీరు నిలవకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. గ్రామంలోని ప్రతి వార్డులో మురికి కాల్వలను శుభ్రం చేయించడం జరుగుతుందన్నారు. పంచాయతీ సిబ్బందితో పాటు కార్యదర్శి పనులు చేయడం పట్ల గ్రామస్తులు ఆయనను అభినందించారు.