ముఖ్యమంత్రి నిర్ణయం హర్షణీయం

ఆలేరు, ఆంధ్రప్రభ : వాసవి మాత జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించి తెలంగాణ ప్రభుత్వం పక్షాన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం పట్ల యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ సముద్రాల సత్యనారాయణ శనివారం హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల ఆర్యవైశ్యులు ఎంతో సంతోషంతో ఉన్నారని ఆయన తెలిపారు. సముచిత నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.
