జూన్ 5న వన మహోత్సవ కార్యక్రమం..

చిట్యాల, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల్లో జూన్ 2 నుంచి 12 వరకు ప్రజాపాలన ముగింపు సభలు నిర్వహించనున్నట్లు చిట్యాల పురపాలక చైర్‌పర్సన్ పందిరి గీత రమేష్ తెలిపారు.

బుధవారం పురపాలక కార్యాలయంలో ప్రజాపాలన ముగింపు సమావేశాల నిర్వహణపై కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మెప్మా సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం చైర్‌పర్సన్ మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ముగింపు వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

జూన్ 4, 6, 8, 10 తేదీలలో వార్డుల వారీగా ప్రజా సమస్యలపై సభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వనమహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ గురులింగం, కౌన్సిలర్లు కోనేటి ఎల్లయ్య, నాగిళ్ల సుధాకర్, నిమ్మనగోటి శ్రీను, కో-ఆప్షన్ సభ్యులు బెల్లి సత్తయ్య, పాటి అరుణ, షహజాబి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply