రెండవ రోజు దగా డీఎస్సీపై ప్రజా పోరాటం ప్రారంభం..

పామర్రు – ఆంధ్రప్రభ : డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని, రాజకీయ బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, రైతులకు సాగున్నీరు అందించాలని, పామర్రులో అర్హులైనవారికి ఇస్తానన్న మూడు సెంట్ల ఇళ్ళ స్థలాలు వెంటనే ఇవ్వాలని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని వెంటనే అమలుచెయ్యాలని పామర్రు టౌన్ కార్యాలయం ఎదుట శుక్రవారం రెండవ రోజు రిలే నిరాహార దీక్ష ప్రారంభమైంది.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పామర్రు నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం లో, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు.

ఈ రిలే నిరాహార దీక్షలు ఆగస్టు 8 వరకు ప్రతిరోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి. నిజాయితీగా చదివిన నిరుద్యోగులకు, విద్యార్థులకు, రైతులకు, మహిళలకు, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు.