12వ జాతీయ చేనేత దినోత్సవం..

గూడూరు – ఆంధ్రప్రభ : గూడూరు మండలంలోని ది పోలవరం చేనేత సహకార సంఘంలో శుక్రవారం 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల సేవలను గుర్తు చేసుకుంటూ వారి సంక్షేమం, చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలపై అవగాహన కల్పించారు. చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించాలని, చేనేత రంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పాల్గొన్న వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు, చేనేత కార్మికులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.