భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా జలధార–జలహారతి

భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా జలధార–జలహారతి

డ్వామా డైరెక్టర్ షణ్ముఖరావు

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : నీటి భద్రత, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జలధార–జలహారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని డ్వామా డైరెక్టర్ షణ్ముఖరావు అన్నారు. జలధార – జలహారతి కార్యక్రమం లో భాగంగా శనివారం శ్రీకాకుళం మండలం సింగుపురం గ్రామం, ఎచ్చెర్ల మండలం ఎస్.యం. పురం గ్రామంలో చెరువులలో జరుగుతున్న పనులతో పాటు లోటుపాట్లును ఆయన పరిశీలించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో ఉన్న పాత చెరువులు, కుంటలు, వాటికి అనుసంధానమైన కాలువలు, వంకలు తదితర జల వనరులను పూడికతీత చేయడం, జంగిల్ క్లియరెన్స్ నిర్వహించడం ద్వారా నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించడం వంటి పనులను గుర్తించి చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ చర్యల ద్వారా వర్షపు నీరు వృథా కాకుండా చెరువుల్లో నిల్వచేసి, భూగర్భ జలాలను పెంపొందించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు.

చెరువుల ఆధునీకరణ ద్వారా శివారు భూములకు కూడా సాగునీరు అందేలా చర్యలు తీసుకుకోవాలన్నారు. నీటి నిలువ సామర్థ్యం ఉన్న ఈ చెరువుల్లో నీటి వృథా కాకుండా కాలువలను పటిష్టం చేయాలని అధికారులకు ఆదేంచారు. గ్రామాల్లో వర్షాలు, వరదలు వచ్చినప్పుడు నీటి ప్రవాహ దిశలు, నీరు ఎక్కువగా చేరే ప్రాంతాలు వంటి విషయాల్లో గ్రామ పెద్దలకు ఉన్న అనుభవాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

ఈ సంవత్సరం వర్షాకాలానికి ముందే అన్ని పనులను పూర్తి చేసి చెరువులు, కుంటలు నీటితో నింపేలా చర్యలు తీసుకోవాలన్నారు. పనుల నిర్వహణలో వీబీ రామ్ జీ పథకాన్ని అనుసంధానం చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ లవరాజు, ఏపిడి కె. లోకేశ్వరరావు, ఏపిఓ సీతారామ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply