CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్
- నిధులు మంజూరు చేయాలని సీఎంకు వినతి
Chief Minister Revanth Reddy | ఉట్నూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy)ని ఈ రోజు ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ హైదరాబాద్ లో మద్యాద పూర్వకంగా కలిసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సీఎంతో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బలోపేతం ఖానాపూర్ నియోజకవర్గ అబివృద్ధి కొరకై చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అటవీ సమస్యలు(forest issues), నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బలోపేతం, తాజా గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు వంటి కీలక అంశాలపై సమగ్ర చర్చ జరిగిందని, ముఖ్యమంత్రి ఖానాపూర్ నియోజకవర్గ ఫలితాలపై హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ బలోపేతంలో వెడ్మ బొజ్జు పటేల్ కృషిని అభినందించారని తెలిపారు.

ముదోల్, నిర్మల్(Mudhol, Nirmal) నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి డీసీసీ అధ్యక్షుడిగా అందరినీ కలుపుకొని సమిష్టిగా ముందుకు సాగాలని సీఎం సూచించారన్నారు. ఇటీవలి ముదోల్, నిర్మల్ నియోజకవర్గా గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి అధిక మద్దతు లభించిన కారణాలను విశ్లేషించి, భవిష్యత్ వ్యూహరచనల్లో పరిగణనలోకి తీసుకోవాలని కోరారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
సీఎంతో త్వరలో జరగబోయే కేస్లాపూర్ నాగోబా జాతర ఏర్పాట్లను వివరించినట్లు వెడ్మ బొజ్జు పటేల్, ఆ జాతర ధ్యాత్మిక, సాంస్కృతిక(culture) ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని అదనపు నిధులు కేటాయించాలని కోరారని తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ఖానాపూర్ఎ మ్మెల్యే, నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు.
