ఓల్డ్ బోయిన్ పల్లి, ఆంధ్రప్రభ : ఓల్డ్ బోయిన్‌పల్లి 119వ డివిజన్ పరిధిలోని అంజయ్యనగర్‌లో పలుచోట్ల చెట్ల కొమ్మలు పెరిగి ఇళ్లపైకి వాలి స్థానికులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. ఈ సమస్యతో బాధపడుతున్న బస్తీవాసులు ఈ విషయం బీజేపీ నాయకుడు ఏనుగుల తిరుపతి యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు.
పిర్యాదు అందుకున్న వెంటనే స్పందించిన ఆయన, ఉద్యాన శాఖ (హార్టికల్చర్) అధికారులతో మాట్లాడి చెట్ల కొమ్మలను తొలగించేలా చర్యలు చేపట్టించారు. కొమ్మల తొలగింపుతో సమస్య పరిష్కారమవడంతో స్థానిక నివాసులు తిరుపతి యాదవ్‌కు కృతజ్ఞతలు తెలియజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఏనుగుల తిరుపతి, రమేష్, సత్యమూర్తి, శ్రీకాంత్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

