Jubilee Hills | కాంగ్రెస్ ఘన విజయం
కాసేపట్లో ఈసీ అధికారిక ప్రకటన
Jubilee Hills | హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills, by-election) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha) పై 24,658 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరికొద్దిసేపట్లో ఎన్నికల కమిషన్ నవీన్ యాదవ్ గెలుపుపై అధికారిక ప్రకటన చేయనుంది. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నవీన్ యాదవ్‌కు ధృవీకరణ పత్రం అందజేయనున్నారు.


