సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం

  • కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి

బిక్కనూర్, ఆంధ్రప్రభ: సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం రామేశ్వర్‌పల్లి గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలను కానుకగా అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ, గుడిసెలేని గ్రామాలుగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతి పేద కుటుంబం సంతోషంగా జీవించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉపసర్పంచ్ గొల్లపల్లి వినోద్ గౌడ్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మద్ది సూర్యకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమేష్ రెడ్డి, సిద్ది రామేశ్వర ఆలయ కమిటీ డైరెక్టర్ రమేష్ రెడ్డి, వార్డు సభ్యులు కృష్ణారెడ్డి, శశికుమార్, పనాస రాజు, భవాని ధర్మస్వామి, చంద్రకళ వీరేశం, కూతరు రమేష్, పంచాయతీ కార్యదర్శి శ్యామ్, గ్రామ అభివృద్ధి కమిటీ కార్యదర్శి నాగర్తి భూమ్‌రెడ్డి, మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.