పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని నిరసన..

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని నిరసన..

బోధన్, ఆంధ్ర ప్రభ : పెన్షనర్ల హక్కులు కాలరాసే విధంగా ప్రభుత్వాలు చేపడుతున్న చట్టాలను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పెన్షన్ దారులు ఆందోళన చేపట్టారు. పిఆర్సి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పదవి విరమణ చేసిన వెంటనే రావాల్సిన బకాయిలను అందజేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పెన్షనర్ ల సంఘం పి ఆర్ టి యు రాష్ట్ర మాజీ అధ్యక్షులు రవికిరణ్, పెన్షనర్ ల నియోజక వర్గ అధ్యక్షులు రాజేశ్వర్ శ్రీనివాస్ రావు, మహిళ ప్రతినిధులు విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.