CBN | కల్లుగీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు..

CBN | కల్లుగీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరం గ్రామంలో నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక కల్లుగీత కార్మికుడు సింహాచలం నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను కలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారుడైన సింహాచలానికి ముఖ్యమంత్రి స్వయంగా రూ.4,000 పింఛన్‌ను అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సింహాచలం మనవడిని అప్యాయంగా ప‌ల‌క‌రించారు..

కల్లుగీత వృత్తిలో ఎదురయ్యే కష్టనష్టాల గురించి ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా సింహాచలం తాటి చెట్ల నుంచి కల్లు తీసే విధానాన్ని వివరించారు. ప్రస్తుతం తాను ఆరు తాటి చెట్ల నుంచి కల్లు గీస్తున్నట్లు తెలిపారు.

అనంతరం సింహాచలం మేనల్లుడు ముసలయ్య తాటి చెట్టుపైకి ఎక్కి కల్లు తీసి చూపించారు. కల్లుగీత ప్రక్రియను ముఖ్యమంత్రి ఆసక్తిగా పరిశీలించారు. తాటి చెట్టు నుంచి తాజాగా తీసుకొచ్చిన కల్లును సీఎం చంద్రబాబు రుచి చూశారు.