జనగణన అధికారులు పగడ్బందీగా చేపట్టాలి..

జనగణన అధికారులు పగడ్బందీగా చేపట్టాలి..

  • ఊట్కూర్ తాసిల్దార్ చింతరవి

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ప్రభుత్వం చేపడుతున్న జనగణన ప్రక్రియలో హాజరయ్యే ఎన్యుమనేటర్లు, సూపర్వైజర్లు ఇంటింటికి వెళ్లి సర్వే పకడ్బందీగా చేపట్టాలని ఊట్కూర్ తాసిల్దార్ చింతారవిఆదేశించారు. బుధవారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ తాసిల్దార్ కార్యాలయంలో ఏన్యుమనేటర్లు, సూపర్వైజర్లకు సర్వేపై పలు సలహాలు సూచనలు చేసి కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి వెళ్లి ఎలాంటి తప్పులు లేకుండా జనగణన సర్వే చేపట్టాలన్నారు.

ఊట్కూర్ మండలంలోని 27 రెవెన్యూ గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి ముందు తమకు అందజేసిన ఇండ్ల జాబితా బ్లాక్ మ్యాపు ఆధారంగా హద్దులను గుర్తించాలనిఅన్నారు. ఈ నెల 11 నుండి జూన్ 9 వరకు జనగణన సర్వే చేపట్టాలన్నారు. ప్రభుత్వం నిబంధన ప్రకారం సర్వే పారదర్శకంగా చేపడుతూ సమయపాలనలతోపాటు నిబద్ధతతో జనగణన విజయవంతం చేయాలన్నారు. ఊట్కూర్ మండలంలో 86 మంది ఎన్యుమనేటర్లు, 15 మంది సూపర్వైజర్లు జనగణన సర్వేలో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు డిజిటల్ యాప్ లో పొందుపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ చేతన్ తదితరులు పాల్గొన్నారు.