వానదేవ… కరుణించవా….

వెల్దండ, ఆంధ్రప్రభ : వానకాలం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్న నేటికీ వర్షాలు కురవకపోవడంతో రైతులు దిగాలుతో ఆందోళన చెందుతున్నారు. వేసిన పంటలకు నీరు లేక ఎండు ముఖం పట్టి ఎదుగుదల నశించి పోవడంతో పంటలల్లో పూర్తిగా నష్టపోతున్నామంటూ రైతులు లబోదిబోమని రోదిస్తూ మహిళల ఆలోచన విధానాలతో మండల పరిధిలోని రాచూర్ గ్రామంలో మహిళలు వర్షాలు అధికంగా కురవాలని కప్పన్ కట్టెకు కట్టుకొని వాన దేవుని పాటలతో గ్రామంలోని వీధి వీధులు కలియ తిరుగుతూ బిక్షాటన చేపట్టారు.