సర్ ఓటర్ సవరణ సర్వేను సద్వినియోగం చేసుకోవాలి..
ఉట్నూర్ రూరల్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఓటరు జాబితా సవరణ సర్వేను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఉట్నూర్ తహసీల్దార్ కోట్నాక్ రఘునాథ్ రావు పిలుపునిచ్చారు.
శనివారం దంతన్పెల్లి గ్రామంలో నిర్వహించిన ఎస్ఐఆర్ ఓటరు సవరణ సర్వేను తహసీల్దార్ కోట్నాక్ రఘునాథ్ రావు, డిప్యూటీ తహసీల్దార్ అమృత్లాల్, ఉపసర్పంచ్ మహమ్మద్ మోబిన్ పరిశీలించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ గ్రామస్తులకు సర్వే ప్రాధాన్యంపై అవగాహన కల్పించి, ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఓటరు సర్వేలో పాల్గొని వివరాలను సక్రమంగా నమోదు చేసి సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు.
“మన ఓటు – మన బాధ్యత” అనే భావనతో ప్రతి ఒక్కరూ సరైన సమాచారాన్ని అందించి సర్వేను విజయవంతం చేయాలని తహసీల్దార్ కోరారు. ఈ కార్యక్రమంలో జీపీఓ తానాజీ, వార్డు సభ్యులు గంగాధర్, రమణి, అంజలి, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
