ఆలేరు రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి..

ఆలేరు,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు అఖిలపక్ష కమిటీ సమావేశం ఆర్యవైశ్య భవన్ లో జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆలేరును రెవెన్యూ డివిజన్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోవాలని సమావేశం సూచించింది. రెండున్నర సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటివరకు రెవెన్యూ డివిజన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కదలిక లేకపోవడం పట్ల సమావేశం ఆవేదన వ్యక్తం చేసింది.

ఆలేరు ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ఎమ్మెల్యే శ్రద్ధ వహించాలని సమావేశం తీర్మానించింది. అఖిలపక్ష కమిటీ కన్వీనర్ పసుపు నూరి వీరేశం,కో-కన్వీనర్ రాచకొండ జనార్ధన్, చెక్క వెంకటేష్, మొరిగాడి రమేష్, వడ్డేమాన్ నరేందర్, కేమిడి ఉప్పలయ్య, కళ్లెపు అడవయ్య, కందుల మధు, కామిటికారి అశోక్, ఎం డి కుర్షిద్ పాష,మంచన మల్లేష్,నమిలే అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply