సింగరేణి లో మెడికల్ బోర్డును పునరుద్ధరించి
సింగరేణిలో మెడికల్ బోర్డును పునరుద్ధరించి
300 మంది డిపెండెంట్ లకు ఉద్యోగాలు ఇవ్వాలి
ఏప్రిల్ లో సింగరేణి లో చేపట్టే సమ్మెను జయప్రదం చేయండి
సింగరేణిలో పెరిగిన రాజకీయ జోక్యం పల్లె కొత్త బొగ్గు గనులు రావడం లేదు
కార్మికవర్గానికి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు
వాసిరెడ్డి సీతారామయ్య పిలుపు
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వీడకుంటే వచ్చే ఏప్రిల్ నెలలో సింగరేణిలో సమ్మె పోరాటాన్ని చేపడతామని సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు. ఈనెల 18న శ్రీరాంపూర్ నుంచి ప్రారంభించిన సేవ్ సింగరేణి జాత శనివారం రాత్రి బెల్లంపల్లి కి చేరుకుంది. ఈ సందర్బంగా బెల్లంపల్లి పట్టణం లోని కాంట చౌరస్తాలో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.ఈ సభ కు ఏ ఐ టీ యూ సీ బెల్లంపల్లి బ్రాంచి సెక్రెటరీ దాగం మల్లేష్ అధ్యక్షత వహించారు.
సింగరేణిలో కార్మికులకు సంబంధించిన మెడికల్ బోర్డు ను ఏర్పాటు చేయడంలో యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని వీరి మూలాన నేడు 300 మంది కార్మికుల డిపెండెంట్ లకు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో వారి కుటుంబాలు నేడు అప్పుల ఊబిలో కూరుకు పోయాయని సీతారామయ్య స్పష్టం చేశారు. మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేకుండా పోయిందని ఆరోపించారు.గత సంవత్సరం ఏసీబీ కేసు నమోదు అయిందనే సాకుతో మెడికల్ బోర్డు నిర్వహణను ఆపివేశారని,కార్పొరేట్ మెడికల్ బోర్డును అవినీతిరహితంగా నడపడంలో సింగరేణి యాజమాన్యం పూర్తిగా విఫలమైందన్నారు.

ఏసీబీ దాడిలో దొరికిన బ్రోకర్లపై కేసులు నమోదు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కుంటి సాకులతో బోర్డు ఆపివేసిందన్నారు. సింగరేణి సంస్థలో పెరిగిన రాజకీయ జోక్యం వల్ల కొత్త బొగ్గు గనులు రావడంలేదని సీతారామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. అనారోగ్యాలతో డ్యూటీలు చేయలేని కార్మికులకు నాగాల పేరుతో కార్మికుల పై చర్యలు తీసుకోవడం దుర్మార్గమన్నారు. సింగరేణి కార్మికుల సొంతింటి కలలు నెరవేర్చేందుకు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన విజ్ఞప్తి విజ్ఞప్తిని అంగీకరించిన సింగరేణి యాజమాన్యం సానుకూలంగా స్పందించినప్పటికీ ఒక ట్రేడ్ యూనియన్ చేసిన నిర్వాకం వల్ల ఈ సమస్యపై కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
సింగరేణిలో డిస్మిస్ కార్మికుల సమస్యను పరిష్కరిస్తామని కార్మికుల సౌకర్యార్థం హైదరాబాదులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని యాజమాన్యం కార్మికులను మభ్యపెడుతూ ఇప్పటికీ కాలయాపన చేస్తున్నారు. సింగరేణిలో కార్మికుల సమస్యల పరిష్కారం పై సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని సమస్యల పరిష్కారం కొరకు వచ్చే నెలలో వచ్చేనెల ఏప్రిల్ లో సింగరేణి వ్యాప్తంగా బొగ్గు గని కార్మికుల సమ్మె చేపట్టనున్నట్లు సీతారామయ్య ప్రకటించారు.

సింగరేణి నెత్తిన పేరుకుపోయిన రూ,,50 వేల కోట్ల బకాయిలు
ఈ సభలో పాల్గొన్న సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. సింగరేణికి విద్యుత్ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం బకాయిగా ఉన్న రూ,,50 వేల కోట్లు నేటికీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపో చెల్లించకపోవడంతో సంస్థ దివాలా తీస్తుందన్నారు. కనీసం కార్మికులకు క్యాలెండర్ కొత్త సంవత్సర క్యాలెండర్ సైతం ఇవ్వలేనంత దీనస్థితికి దిగజారిందన్నారు.కార్మికులకు నూతన ట్రాన్స్ఫర్ పాలసీ, జనరల్ అసిస్టెంట్ (సర్ఫేస్) కార్మికుల నియామకం పాలసీ ద్వారా కార్మికులను యాజమాన్యం అవస్థలకు గురిచేస్తూ, విజిలెన్స్ ఎంక్వయిరీ పేరు మీద కార్మికులను డిస్మిస్ చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు.
కారుణ్య నియామకాల్లో కారుణ్యం లేని నిబంధనలతో వేధిస్తున్నారని . మైనింగ్, ట్రేడ్స్ మెన్లకు అన్ఫిట్ అయినవారికి సూటబుల్ జాబ్ ఇస్తామని అంగీకరించి అది కూడా అమలు పరచడంలేదని ఆయన సింగరేణి యాజమాన్యం తీరుపైఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో కొత్త గా ప్రారంభించాల్సిన గనులు ఇల్లందులోని కోయగూడెం-3, జెకె-5 ఎక్సటెన్షన్ (రొంపేడు), మణుగూరులోని మణుగూరు ఓపెన్ కాస్ట్, పీ కె ఓ సీ -2 డిప్ సైడ్ బ్లాక్, భూపాలపల్లిలోని పి.వి.నర్సింహారావు ఓపెనకాస్ట్, కే టీ కే ఓ సీ -2 పంచ్ ఎంట్రీ, తాడిచర్ల -2, ఆర్ కే ఓ సీ ఎక్స్ టెన్షన్ , బెల్లంపల్లి లోని గోలేటి, మధారం ఓ పెన్ కాస్ట్ గనులను యాజమాన్యం ప్రారంభించకుండా సింగరేణిలో కార్మికులు అదనంగా ఉన్నారని సింగరేణి యాజమాన్యం పేర్కొనడం సిగ్గుచేటన్నారు.
క్లరికల్, పారా మెడికల్, ఎస్ అండ్ పీ సీ, పీ వో ఏ , ఎలక్ట్రిషియన్లు, ఫిట్టర్లు ఇతర డిపార్ట్మెంట్లలోని ఖాళీలను ఇంటర్నల్ ఉద్యోగులతో వెంటనే భర్తీ చేయాలని ఆయన సింగరేణి యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని క్యాడర్ స్కీంలు సవరించాలని, ఓవర్మెన్ ఖాళీలలో సీనియర్ మైనింగ్ సర్దార్లకు ప్రమోషన్లు ఇవ్వాలనీ, సాధారణ మరణం పొందినా కార్మికులకు రూ.25 లక్షల ఎక్స్రేషియా చెల్లించాలనీ ఆయన సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ సభకు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచి సెక్రటరీ దాగం మల్లేష్ అధ్యక్షత వహించగా,సీ పీ ఐ రాష్ట్ర దర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్,అసిస్టెంట్ సెక్రెటరీ దాసరి తిరుపతి గౌడ్,సీనియర్ నాయకులు చిప్ప నర్సయ్య,మిట్టపల్లి వెంకటస్వామి,ఏ ఐ టీ యూ సీ డిప్యూటీ సెక్రెటరీ వై వీ రావు
సిపిఐ నాయకులు ఆడెపు రాజమౌళి,పెద్దసంఖ్యలోనాయకులుకార్యకర్తలుపాల్గొన్నారు.అంతకు ముందు బెల్లంపల్లి పట్టణం లోని సీ పీ ఐ కార్యాలయం నుంచి కన్నాల ఫ్లైఓవర్ వరకు అక్కడినుంచి కాంటా చౌరస్తా వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు
