శ్రీ పార్వతి శంభులింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు..

శ్రీ పార్వతి శంభులింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు..

రామన్నపేట, ఆంధ్రప్రభ : రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో శ్రీ పార్వతి శంభులింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రోజు రాత్రి పార్వతి అమ్మవారికి శంభులింగేశ్వర స్వామికి ఘనంగ కళ్యాణం నిర్వాహించారు.స్వామి వారికి వెల్లంకి గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ ఇంటి నుండి ఊరేగింపుగా వచ్చి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు 2001-02 పదవ తరగతి బ్యాచ్ అన్నప్రసాధ వితరన కార్యక్రమం నిర్వహించారు. జంగి రెడ్డి టీం వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు,ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు ఎడ్ల శిల్పా – మహేందర్ రెడ్డి దంపతులు గ్రామ సర్పంచ్ ఇడెం రాధా – శ్రీనివాస్ దంపతులు ఉప సర్పంచ్ మిర్యాల రాజకుమార్,మాజీ సర్పంచులు,మాజీ ఎంపిటిసిలు, వార్డు సభ్యులు బిఆర్ఎస్ పార్టీ అద్యక్షు కార్యదర్శులు,దేవాలయ కమిటి చైర్మన్ వనం సత్తయ్య గారు, గ్రామంలోని అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.