తాడిచెర్ల బ్లాక్-2 సింగరేణికి కేటాయింపు
- ఆర్‌కేపిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం
క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : తాడిచెర్ల బ్లాక్-2 బొగ్గు గనిని సింగరేణి సంస్థకు కేటాయించిన సందర్భంగా సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆర్‌కేపి సిహెచ్‌పిలో రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు.అహర్నిశలు కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ కు కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, తాడిచెర్ల బ్లాక్-2 కేటాయింపుతో వేలాది కార్మిక కుటుంబాలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, సింగరేణి సంస్థ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎం, డి,అజిద్, జిల్లా కార్యదర్శి గాండ్ల సమ్మయ్య, మహంకాళి శ్రీనివాస్, గోపతి బానేష్, పట్టణ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ బత్తుల వేణు, కార్మికులు చిలుకల మధు, కాంపల్లి నరసయ్య, ఎర్రబెల్లి రాజేష్, నల్లగొండ నర్సింగం గౌడ్, ముస్తఫా, పత్తి రాజిరెడ్డి, రాపోలు శ్రీనివాస్, ముడిమడుగుల మనోహర్, అనిత, లావణ్య, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
