ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల కోసం ప్రత్యేక ప్రచారం

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు శనివారం మండలంలోని వివిధ గ్రామాలలో అడ్మిషన్ నిర్వహించారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థిని విద్యార్థులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నట్లూ తెలిపారు.

అంతేగాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచితం పాఠ్యపుస్తకాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, సైన్స్ కు సంబంధించిన ప్రయోగశాలలు,ప్రతి రోజూ స్లిప్ టెస్టుల నిర్వహణ, వారాంతపు టెస్టులు, విద్యార్థిని విద్యార్థుల మానసిక ఉల్లాసానికి క్రీడల ప్రాధాన్యత, ఉంటాయని కళాశాల ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అడ్మిషన్ డ్రైవ్ లో అధ్యాపకులు వెంకటేష్, శ్రీహరి, గంగారాం, మురళి, స్వాతి పాల్గొన్నారు.

Leave a Reply