ఖమ్మం జిల్లాలో బస్సు బోల్తా..
ఖమ్మం జిల్లాలో బస్సు బోల్తా..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం చిక్కపల్లి నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు కొత్తలంకపల్లి రైల్వే వంతెన పై బోల్తాపడింది. బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, మరో 22 మందికి స్వల్ప గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
