కాళ్లు, చేతులు లేకపోయినా చరిత్ర సృష్టించిన వారెందరో

కాళ్లు, చేతులు లేకపోయినా చరిత్ర సృష్టించిన వారెందరో

  • చూపులేకపోయినా కోట్లాది జీవితాల్లో వెలుగులు నింపిన వారున్నారు
  • శరీరంతో కాదు…మనసుతో గెలవండి
  • యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే దివ్యాంగులకు 3 రేట్ల బడ్జెట్
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడి

సిరిసిల్ల, ఆంధ్రప్రభ ; అవయవ లోపం అనేది బలహీనత కాదని, జీవితాన్ని మరో కోణంలో గెలిచే శక్తిగా భావించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రాల్లో అవయవ లోపం ఉన్నవారికి ఉపకరణాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ. కాళ్లు, చేతులు లేకపోయినా చరిత్ర సృష్టించిన వారెందరో ఉన్నారు. కంటి చూపు లేకపోయినా కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపి ఎంతో మంది దివ్యాంగులు స్రుష్టించారన్నారు. దివ్యాంగులకు సేవ చేయడం మహాభాగ్యమని, అందులో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే దివ్యాంగుల కోసం రూ.100 కోట్లకుపైగా వెచ్చించి ఉపకరణాలు అందించామని తెలిపారు.

దివ్యాంగుల అభ్యున్నతికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోందన్నారు. గత యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే అత్యధిక నిధులు కేటాయిస్తోందన్నారు. 466 మంది దివ్యాంగులక సిరిసిల్ల జిల్లాలో ఈరోజు 84 లక్షల కేంద్ర నిధులతో 466 మంది దివ్యాంగులకు 813 పరికరాలను కొనుగోలు చేసి దివ్యాంగులకు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. గతంలో కరీంనగర్ లో, వేములవాడలో కూడా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి పెద్ద ఎత్తున పరికరాలను పంపిణీ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందేనని, త్వరలోనే దివ్యాంగులందరికీ ఉపకరణాలు అందిస్తానన్నారు.

ఇవి మాత్రమే కాకుండా మహిళలు, పిల్లలు, వ్రుద్దుల కోసం కేంద్రం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోంది. అంగన్ వాడీ కేంద్రాల్లో బాలామ్రుతం, గుడ్డు సహా పిల్లలకు అందించే పోషకాహారం కేంద్ర నిధులతో అందిస్తున్నారని, గర్భిణీ మహిళలకు పౌష్టికాహారం, గడ్లు, పాలుసహా అన్నింటికీ కేంద్రమే నిధులిస్తూ గర్భిణీ మహిళలు, పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడకుండా ఆరోగ్యవంతంగా జీవనం కొనసాగేలా చేస్తోందన్నారు.

వ్రుద్దులకు, దివ్యాంగ ఆశ్రమాలకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులను విడుదల చేస్తూ వారి జీవనానికి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటోందని, నా పార్లమెంట్ పరిధిలో ఇప్పటి వరకు గర్బిణీ మహిళలు, పిల్లలు, వ్రుద్దులు, దివ్యాంగుల సంక్షేమం కోసం దాదాపు 100 కోట్లను కేంద్రం ఖర్చు చేసింది. కేంద్రం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ తో పాటు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply