Brs l గెలుపు దిశగా బండి ప్రవీణ్ కుమార్..

Brs l గెలుపు దిశగా బండి ప్రవీణ్ కుమార్..
ఆదరించండి అందరికీ అందుబాటులో ఉంటాను
కేటీఆర్ ర్యాలీలో బండి ప్రవీణ్ కుమార్
Brs l నర్సంపేట రూరల్ ఆంధ్రప్రభ; నర్సంపేట మున్సిపాలిటీలోని 30వ వార్డులో కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న బండి ప్రవీణ్ కుమార్ ఎన్నికల రోజు ఉదయం నాటికి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. ప్రచారం ముగిసిన అనంతరం కూడా వార్డులో ఆయనకు అనుకూల వాతావరణం కొనసాగుతుండటంతో గెలుపు దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇంటింటి ప్రచారం, ప్రజలతో నేరుగా మమేకమవడం, వార్డు సమస్యలపై స్పష్టమైన అవగాహనతో హామీలు ఇవ్వడం బండి ప్రవీణ్ కుమార్‌కు ప్రధాన బలంగా మారాయి. తాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, పారిశుధ్యం, వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాలపై ఆయన ప్రకటించిన అభివృద్ధి ప్రణాళికలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
ప్రత్యేకంగా యువత, మహిళలు ఆయనకు బలమైన మద్దతుగా నిలవడం ఈ ఎన్నికల్లో కీలకంగా మారనుందని స్థానికులు చెబుతున్నారు. ప్రచార కాలంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయడంతో వార్డు మొత్తం బండి ప్రవీణ్ కుమార్‌కు అనుకూలంగా మారినట్లు కనిపిస్తోంది. మొత్తంగా పోలింగ్‌కు ముందు ఏర్పడిన రాజకీయ పరిస్థితులు బండి ప్రవీణ్ కుమార్‌కు అనుకూలంగా ఉన్నాయని, ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా 30వ వార్డులో ఆయన విజయం ఖాయమనే అంచనాలు బలపడుతున్నాయి.
