సత్యమును పరామర్శించిన పరపతి సంఘం కోశాధికారి..
కరిమాబాద్, ఆంధ్రప్రభ : పద్మశాలి వర్కింగ్ జర్నలిస్టుల పొదుపు సహాయక సహకార పరపతి సంఘం సభ్యుడు బత్తుల సత్యం ఇటీవల మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై స్థానిక రోహిణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పరపతి సంఘం కోశాధికారి వేముల సదానందం నేత ఉదయం ఆసుపత్రికి వెళ్లి సత్యంను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, బత్తుల సత్యం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సత్యం కుటుంబ సభ్యులకు వేముల సదానందం నేత ధైర్యం చెప్పారు. సంఘం తరపున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
