Boyapati | తెలుగు హీరోతోనే మూవీ చేస్తున్నాడా..?

Boyapati | తెలుగు హీరోతోనే మూవీ చేస్తున్నాడా..?
బోయపాటి నెక్ట్స్ మూవీ ఎవరిలో?
పాన్ ఇండియా కోసం బోయపాటి విశ్వప్రయత్నం
‘అఖండ 2’ తర్వాత పరిస్థితి ఎలా?
రణ్‌వీర్ సింగ్ ప్రాజెక్ట్ ఎందుకు ఆగింది?
రానాతో ఫిక్స్ అయ్యిందా బోయపాటి మూవీ?
ఈసారైనా పాన్ ఇండియా కల నిజమవుతుందా?
Boyapati | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అఖండ 2 తర్వాత ఇంత వరకు కొత్త సినిమా ఎవరితో అనేది అనౌన్స్ చేయలేదు. బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ తో మూవీ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. దాదాపు కన్ ఫర్మ్ అంటూ ప్రచారం జరిగింది. అయితే.. ఇంత వరకు ఎలాంటి అప్ డేట్ లేదు. ఇప్పుడు బోయపాటి నెక్ట్స్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఇంతకీ.. బోయపాటి మూవీ ఫిక్స్ అయ్యిందా..? ఎవరితో..?
Boyapati | బోయపాటి విశ్వప్రయత్నం..

టాలీవుడ్ డైరెక్టర్స్ ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ చేయాలని తపిస్తున్నారు. తెలుగు స్టార్ తో అయినా.. బాలీవుడ్ స్టార్ తో అయినా.. పాన్ ఇండియా మూవీ చేయడం అనేది ఇంపార్టెంట్ గా తయారైంది. పాన్ ఇండియా మూవీ చేయకపోతే రేసులో వెనుకబడిపోతున్నారు. అందుకనే ఎలాగైనా సరే ఆ ట్రాక్ లోకి వెళ్లాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో కొందరు సక్సెస్ అవుతున్నారు.. మరి కొందరు ఫెయిల్ అవుతున్నారు. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు బోయపాటి ఉన్నారు.
Boyapati | నిరాశపరిచిన అఖండ 2..

బోయపాటి అఖండ 2 మూవీని పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేశారు కానీ.. అనుకున్న టైమ్ కి ఆ సినిమా రిలీజ్ కాలేదు. దీంతో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. అలాగే తెలుగుతో తప్పితే మిగిలిన భాషల్లో ఈ సినిమా ఆకట్టుకోలేదు. దీంతో బోయపాటి పాన్ ఇండియా కల కలగానే మిగిలిపోయింది. అయినా సరే.. ఈసారి పాన్ ఇండియా మూవీని గట్టిగా ప్లాన్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ధురందర్ హీరో రణ్ వీర్ సింగ్ కోసం ట్రై చేశారు. రణ్ వీర్ సింగ్ కి స్టోరీ కూడా చెప్పాడని వార్తలు వచ్చాయి. అయితే.. ఆయన కోసం వెయిటింగ్ లో ఉన్న డైరెక్టర్స్ చాలా మంది ఉండడంతో బోయపాటిని హోల్డ్ లో పెట్టారట.
Boyapati | రానాతో ఫిక్స్ అయ్యిందా..?

రణ్ వీర్ సింగ్ ని నమ్మకుంటే.. ఇప్పట్లో తేలేలా లేదని తెలుగు హీరో కోసం మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారట బోయపాటి. అయితే.. దగ్గుబాటి రానాతో మూవీ ఫిక్స్ అయ్యిందని టాక్ బలంగా వినిపిస్తోంది. రానాకు సౌత్ తో పాటు నార్త్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. పైగా తన స్క్రిప్ట్ కి రానానే పర్ ఫెక్ట్ అని బోయపాటి ఫిక్స్ అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. రణ్ వీర్ సింగ్ కోసం రెడీ చేసిన కథతోనే రానాతో మూవీ చేయాలి అనుకుంటున్నారా..? లేక రానా కోసం వేరే కథ రెడీ చేసారా..? అనేది తెలియాల్సివుంది. మరి.. ఈసారైనా బోయపాటి పాన్ ఇండియా కల నిజమౌతుందో లేదో చూడాలి.
