మరమ్మత్తుకు గురైన బోరింగ్.. రిపేర్ చేయించిన సర్పంచ్..

మరమ్మత్తుకు గురైన బోరింగ్.. రిపేర్ చేయించిన సర్పంచ్..

ఆళ్లపళ్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్లోని బోరింగ్ మరమ్మత్తులకు గురి కావడంతో సర్పంచి వాసం సుస్మిత, కార్యదర్శి ఉపేందర్ ఆదేశాలతో చేతిపంపుకు మరమ్మత్తులు చేపట్టారు. అనంతరం సర్పంచి వాసం సుస్మిత మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి నీటి కొరత సమస్య రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశాల మేరకు, భద్రాద్రి జిల్లా డిపిఓ విద్యచందన, డిఎల్పిఓ ప్రభాకర్ సూచనల మేరకు ఎంపీడీవో ధీరావత్ శ్రీను, పంచాయతీ అధికారి ఫణింద్రకుమార్ల సూచనతో మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ బోరింగ్ ను మరమ్మత్తులు చేపట్టడం జరిగిందని, కార్యదర్శి ఉపేందర్ తెలిపారు.

ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా ఎప్పటికప్పుడు నివారించడమే లక్ష్యంగా ఆళ్లపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాలను పర్యవేక్షణలు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకోవడం, పంచాయతీల అభివృద్ధికి రావలసిన, కావాల్సిన కార్యక్రమాలను తెలుసుకుని.. అధికారుల సంయమనంతో సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, మరమ్మత్తులు చేపట్టడం జరుగుతుందని సర్పంచ్ వాసం సుష్మిత తెలిపారు.

గ్రామపంచాయతీ కార్యదర్శి ఉపేందర్ సహాయ, సహకారాలతో నీటిఎద్దడి నివారణకు, గ్రామాల సమస్యలను స్వయంగా పర్యవేక్షించి, మరమ్మత్తులకు నోచుకోని చేతిపంపులకు, బోరింగ్ రిపేర్లు చేయించి ప్రజలకు సురక్షితమైన నీటి సౌకర్యం కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. అదే క్రమంలో పంచాయతీలో అక్కడక్కడ మిషన్ భగీరథ పైప్ లీకేజీలు పరిశీలించి, సంబంధిత జిల్లా అధికారి పద్మ ఆదేశాలతో ఏఈ సతీష్ సహకారంతో లీకేజీలను మరమ్మత్తులు చేయించడం జరిగిందని తెలిపారు. పంచాయతీలో పారిశుద్ధ్య పనులు సైతం పర్యవేక్షణలు పరిశుభ్రంగా ఉండేందుకు కార్మికులకు ఆదేశాలను జారీ చేయడం జరిగిందని తెలిపారు.

భూగర్భజలాలు అడుగంటిపోవడంతో కొన్ని కొన్ని బోరింగులు మరమ్మత్తులకు గురవుతున్నాయని.. అయినా కొన్ని బోరింగ్లకు లోపల మట్టికూరుకుపోవడం, చెడిపోయి పని చేయకపోవడంతో బోరింగ్ ఐరన్ మెటీరియల్ సహాయంతో మరమ్మత్తు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో నీటి ఎద్దడి, డంపింగ్ యార్డ్, డ్రైనేజీలు రోడ్లకిరువైపులా చెత్తను తొలగించడం, రోడ్లకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్, నర్సరీలు, గ్రామీణ ఉపాధి పనులు, పల్లెప్రకృతి, బృహత్ వనాలకు దిశనిర్దేశం ప్రణాళికలను సిద్ధం చేయడం, పలు అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాల్లో విశ్రమించక నిరంతరాయంగా ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా భావిస్తున్నానని సర్పంచి వాసం సుష్మిత, కార్యదర్శి ఉపేందర్ తెలిపారు.