స్వామిని దర్శించుకున్న న్యాయమూర్తి
స్వామిని దర్శించుకున్న న్యాయమూర్తి
మోపిదేవి, ఆంధ్రప్రభ : మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని హై కోర్ట్ జస్టిస్ టి.సి.డి.శేఖర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తొలుత ఆలయం మర్యాదల ప్రకారం ఆయనకు ఘన స్వాగతం పలికారు. నాగపుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఆలయ పర్యవేక్షకులు మధుసూదన రావు స్వామివారి చిత్రపటం ప్రసాదాలను ఆయనకు అందజేశారు.
