దుర్గమ్మను దర్శించుకున్న జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్
దుర్గమ్మను దర్శించుకున్న జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్
అంతర్ సింగ్ ఆర్యకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో శీనా నాయక్.
కనకదుర్గమ్మను దర్శించి ప్రత్యేక పూజలు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య ఇంద్రకీలాద్రి పై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంకు చేరుకున్న సందర్భంగా ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య గర్భగుడిలో కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేసిన ఆయనకు దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్ ఆలయ సంప్రదాయాల ప్రకారం చైర్మన్‌కు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలు, పవిత్ర చిత్రపటాన్ని అందజేసి మర్యాదపూర్వకంగా సత్కరించారు.
