భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

వాగులు, వంకలు దాటొద్దు.. ప్రజలకు బొల్లు దేవేందర్ ముదిరాజ్ సూచనలు

తాడ్వాయి, ఆంధ్రప్రభ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్ ముదిరాజ్ సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున వాటిని దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు.

వర్షాల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలే ప్రమాదం ఉన్నందున వాటికి దూరంగా ఉండాలని తెలిపారు. అలాగే నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.

చిన్నారులను వాగులు, వంకలు, నీటి ప్రవాహాల వద్దకు వెళ్లనివ్వకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారుల సూచనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని బొల్లు దేవేందర్ ముదిరాజ్ పేర్కొన్నారు.