అర్ధరాత్రి పంచాయతీ కార్యాలయంపై దాడి..

  • అద్దాలు ధ్వంసం చేసిన దుండగులు

ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలంలోని ఏఆర్‌పీ క్యాంపు గ్రామపంచాయతీ కార్యాలయ కిటికీ అద్దాలను శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది.

గ్రామ సర్పంచ్ వినోద్ తెలిపిన వివరాల ప్రకారం, కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మద్యం మత్తులో గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చి కిటికీ అద్దాలను ధ్వంసం చేసినట్లు ఆరోపించారు. ఈ ఘటనతో ప్రభుత్వ ఆస్తికి నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు.

ఈ ఘటనపై ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సర్పంచ్ వెల్లడించారు. కేసు నమోదు చేసి నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.