15వ ఫైనాన్స్ నిధులు విడుదల చేయాలని డిమాండ్
15వ ఫైనాన్స్ నిధులు విడుదల చేయాలని డిమాండ్
ఎడపల్లి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 15 ఫైనాన్స్ నిధులను విడుదల చేయాలని కోరుతూ ఎడపల్లి మండలానికి చెందిన పలువురు సర్పంచులు బుధవారం ఎంపీడీవో శంకర్ కు వినతిపత్రం అందజేశారు. 15 ఫైనాన్స్ నిధులు విడుదల చేయకపోతే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.
మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవోను సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిసి ఎదుర్కుంటున్న సమస్యలు విన్నవించారు.ఈ సందర్భంగా ఎడపల్లి సర్పంచ్ కందగట్ల రామ్ చందర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధి కొరకు 15 ఫైనాన్స్ నిధులను విడుదల చేసిందని కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిధులను నిలిపివేసిందని, ఇది శోచనీయమని తక్షణమే 15 ఫైనాన్స్ ఇందులో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 24 గంట లలో 15 ఫైనాన్స్ నిధులు విడుదల చేయకపోతే నిరాహార దీక్ష చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
