Cockroach Party | ప్రజాస్వామ్య చైతన్యానికి కొత్త చర్చ
Cockroach Party | ప్రజాస్వామ్య చైతన్యానికి కొత్త చర్చ
Cockroach Party | కాక్రోచ్ పార్టీ ఆవిర్భావం, యువత నిరసనల నేపథ్యం
హైకోర్టుల్లో నిరసనలకు సంబంధించిన కీలక కేసులు
ప్రజల హక్కులు, న్యాయవ్యవస్థ స్పందనపై విశ్లేషణ
Cockroach Party | నెల రోజుల క్రితం భారత ప్రధాన న్యాయమూర్తి ఓ సందర్భంలో భారతీయులు బొద్దింకల్లా వ్యవహరిస్తారని అన్నారు. వెంటనే ఆయన నిరుద్యోగులైన యువకులు బొద్దింకల్లా వ్యవహరిస్తారంటూ వివరణ ఇచ్చారు. నకిలీ డిగ్రీలతో వృత్తి విద్యల్లో చేరిన వారిని గురించి తాను ప్రస్తావించానని అన్నారు.
నిరాశా, నిస్పృహలతో వందలాది మంది యువకులు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జాతీయ పతాకాలను పుచ్చుకుని కొత్త కాక్రోచ్ పార్టీ ప్రారంభం రోజున చేరి నిరసన తెలియజేశారు. ఈ నిరసనలు అన్ని రాష్ట్రాలకూ పాకాయి. ఈ స్థాయిలో నిరసనలను అనుమతిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో పౌరులు తమ నిరసనను వ్యక్తం చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. ఇదేమీ వారికి ఇచ్చిన బహుమానం కాదు. ఇది హక్కు.
కాక్రోచ్ జనతా పార్టీకి అనుమతి లభించింది. ప్రభుత్వం తన విధులను విస్మరిస్తే యువకులు, ఉద్యోగార్థులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతారు. ఈ నిరసనలు హైకోర్టుకు వస్తే, భారత న్యాయవ్యవస్థ ఎలా స్పందిస్తుంది? 2021 నుంచి 2026 వరకు ఢిల్లీ హైకోర్టులోని వివరాలను పరిశీలిస్తే, 136 అంశాలు బొంబాయి, ఢిల్లీ హైకోర్టుల ముందు వచ్చాయి. వీటిపై కోర్టు స్పందించిన తీరును పొందుపరచడం జరిగింది.
బొద్దింకలు ఎవరు? దేశంలో కాక్రోచ్లుగా పిలువబడుతున్న వారంతా వ్యక్తులే. వీరంతా తమ కేసులను దాఖలు చేశారు. వీరిలో 76 శాతం కోర్టుల మెట్లు ఎక్కారు. వీరిలో అధిక సంఖ్యాకులు తమ నిరసన ప్రదర్శనలకు ప్రదేశాన్ని ఎంపిక చేసేందుకు అనుమతి ఇవ్వమని కోరారు. తమ నిరసనలకు భద్రత కల్పించాలని కోరారు. తమపై దాఖలైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని కోరారు.
ఇవేమీ ఆశ్చర్యం కలిగించలేదు. కానీ, ఢిల్లీలో నిరసన కేసుల్లో మూడో వంతు దాఖలైన కేసుల్లో నిరసన ప్రదర్శకులు దాఖలు చేసినవి కావు. పాఠశాలలను, లిక్కర్ దుకాణాలను, ఇతర షాపులను మూసివేయాలన్న డిమాండ్‌పై దాఖలైనవి కొన్ని ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థల పేరిట రాజకీయ పార్టీలు దాఖలు చేసినవి.

బొద్దింకలు కోరేదేమిటి? ఈ ప్రదర్శనకారులు ఊహించినంత అత్యుత్సాహమైనవారు కారు. కారికేచర్లపై పెయింట్ చేసిన మాదిరిగా కూడా కాదు. కొందరు ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆశ కలిగిన వారు. మరికొందరు వచ్చే ఎన్నికల్లో గెలవాలన్న ఆశ కలిగిన వారు. వారి అభ్యర్థనలు చాలా చిన్నవి. జాతీయ ప్రాధాన్యం కలిగినవి. ముఖ్యంగా మానవత్వంతో కూడినవి. ఢిల్లీలో దశాబ్దాలుగా పరిష్కారం కానివి. అవి నీతి నిర్మాణానికి సంబంధించినవి. సైనికుల పెన్షన్ కోసం దాఖలు చేసినవి కూడా ఉన్నాయి.
కాగా, బొంబాయి హైకోర్టులో శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) శివాజీ పార్క్‌లో దసరా ర్యాలీ నిర్వహణకు సంబంధించిన అంశం విచారణకు వచ్చింది. ఈ విషయంలో మునిసిపల్ కార్పొరేషన్ తన అధికారాలను దుర్వినియోగం చేసిందని పిటిషనర్ పేర్కొన్నారు. నెలల తర్వాత సీపీఎం కార్యకర్త ఒకరు గాజాలో యుద్ధానికి వ్యతిరేకంగా మన దేశం పోరాడాలన్న అంశంపై పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కోర్టు పిటిషనర్లను దేశభక్తులుగా వ్యవహరించమని కోరింది. దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై పిటిషన్లు దాఖలు చేయాలని సూచించింది.
ముంబై నిరసన కేసుల్లో మూడింట రెండొంతులు ఆస్తులకు సంబంధించినవి. పింప్రి-చించ్వాడ, కుడాల్వాడీలలో ఆక్రమణల కేసులు, అక్రమంగా తుక్కు నిల్వ చేసిన గిడ్డంగులను కార్పొరేషన్ అధికారులు బుల్డోజ్ చేసిన అంశాలు ఉన్నాయి. చాలా కేసుల్లో విషయం వివాదంగానే నమోదవుతోంది. పోలీసులు అనుమతి ఇవ్వలేదనే కారణంతో ఫిర్యాదులు వచ్చినవి. నిరసనల్లో పేద ప్రజలకు సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉంటున్నాయి. తప్పుడు ఎఫ్ఐఆర్లను సవాలు చేస్తూ దాఖలైన కేసులూ ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో పిటిషనర్లు గెలిచిన కేసులే ఎక్కువ.
మన దేశంలో కోర్టులు న్యాయపరమైన ప్రదర్శనలకు సంబంధించిన కేసులను అనుమతిస్తాయి. శరద్ రామదాస్ మాలీ వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం కేసులో ఔరంగాబాద్ బెంచ్, ప్రదర్శన నిర్వహించినందుకు దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది. అదే సందర్భంలో శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహించిన కేసులో అరెస్టు అయిన వ్యక్తి కస్టడీ మరణంపై పోలీసు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.
శివసేన వర్సెస్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కేసులో కార్పొరేషన్ తన అధికారాలను దుర్వినియోగం చేసిందని కోర్టు స్పష్టం చేసింది. శివసేన ర్యాలీ నిర్వహణకు అనుమతి నిరాకరించడాన్ని తప్పుపట్టింది. పర్బనిలో సామ్రాట్ వర్సెస్ జిల్లా మేజిస్ట్రేట్ కేసులో ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని కోర్టు తప్పుపట్టింది. అయితే, కుడాల్వాడీ ఆక్రమణల కేసులో దశాబ్దాల తరబడి దుకాణాలు, షాపులు ఏర్పాటు చేసుకున్న వలసదారులపై ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న చర్యలను కూడా ప్రశ్నించింది.
అలాగే, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వర్సెస్ పోలీసు కమిషనర్ కేసులో సమ్మెకు దిగిన పారిశుధ్య కార్మికులపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయితే, కోర్టు ఉపయోగించిన భాష అసంబద్ధంగా ఉందని కూడా పేర్కొనడం జరిగింది. మా అధ్యయనం లోతైనది. 2021లో జరిగిన కేసులకు సంబంధించిన విశ్లేషణ ఇది. భీమా-కోరేగావ్ తదితర కేసుల్లో ప్రజల హక్కులకు సంబంధించి కోర్టులు మరింత ఉదారంగా స్పందించాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇలాంటి కేసుల్లో వృద్ధుడైన ఒక పూజారికి సంబంధించిన అంశం, ఉగ్రవాద వ్యతిరేక కేసులో గర్భిణి స్త్రీ పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ఘటన వంటి అంశాలు ఉన్నాయి. యువకులు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలపడం వల్లే ఈ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.
– న్యూస్ డెస్క్
