సింగరేణి భరోసా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: బుర్ర వెంకటేష్ గౌడ్
చిట్యాల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి మండలంలోని గొర్లవేడు రోడ్డులోని వీఎల్ కన్వెన్షన్లో సోమవారం నిర్వహించనున్న సింగరేణి భరోసా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ చిట్యాల మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ పిలుపునిచ్చారు.
ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు వెల్లడించారు.
మండలంలోని బీజేపీ కార్యకర్తలంతా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బుర్ర వెంకటేష్ గౌడ్ కోరారు. ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు గుండ సురేష్, చింతల రాజేందర్, కేంసారపు ప్రభాకర్, గుండ మణికుమార్ తదితరులు పాల్గొన్నారు.
