Prakashraj | ప్రకాశ్ రాజ్ సంచలన పోస్ట్ వైరల్

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి తన సోషల్ మీడియా పోస్టుతో చర్చనీయాంశంగా మారారు. రాజకీయాలు, సామాజిక అంశాలపై తరచూ స్పందించే ఆయన ఈసారి కూడా పరోక్ష వ్యాఖ్యలతో ఆసక్తి రేకెత్తించారు.

తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో “నేను మౌనంగా లేను.. అన్నీ చూస్తున్నా. మీ అందరికీ నా సమాధానం ఒక్కటే… దిగజారండి.. దిగజారుతూనే ఉండండి” అంటూ ఆయన చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.

యూట్యూబర్ రావణ్ ఉదంతంలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పేరు తెరపైకి రావడంతో సోషల్ మీడియాలో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు, ప్రచారం మొదలైంది. దీనిపై ప్రకాష్ రాజ్ నా ప్రశ్నించే గొంతును ఎవరూ ఆపలేరంటూ వీడియోను ట్విటర్‌ విడుదల చేశారు. తాను మౌనంగా లేనని, జనసైనికులు, కొన్ని ఛానళ్లు, యూట్యూబర్లు చేస్తున్న అబద్ధాల ప్రచారాన్ని గమనిస్తున్నానని తెలిపారు.

దీంతో ఈ పోస్టుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కొందరు నెటిజన్లు ఆయన అభిప్రాయానికి మద్దతు తెలుపుతుండగా, మరికొందరు విమర్శలు చేస్తున్నారు.