కాంగ్రెస్ గూటికి ఫతేపూర్, వేపూర్ సర్పంచులు
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో 250 మంది కాంగ్రెస్‌లో చేరిక
మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ : మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆదివారం వివిధ పార్టీలకు చెందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు కలిపి సుమారు 250 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వేపూర్ సర్పంచ్ నాయికోట చెన్నయ్య మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల మంజూరు జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొ
