TG | ఉమెన్స్‌ డే వేడుకల ఏర్పాట్లపై సీఎస్‌ సమీక్ష !

మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. మహిళలు భారీ సంఖ్యలో హాజరవుతున్నందున, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కోరారు.

8న పరేడ్‌ గ్రౌండ్‌లో జరుగనున్న మహిళా సదస్సు ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలో సీఎం సమీక్షించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి మహిళా శక్తి పాలసీని విడుదల చేస్తారని, మహిళా సమాఖ్యలకు అందజేయనున్న బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారని ఆమె తెలిపారు.

అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌కు అంతరాయం కల్గకుండా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులకు బైసన్‌పోలో మైదానంలో పార్కింగ్‌ ఏర్పాటు చేయాలని, పార్కింగ్‌ ఏరియాల్లో లైటింగ్‌ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు.

సభకు హాజరయ్యేవారికి సరిపడా తాగునీరు, మజ్జిగ ఏర్పాటు చేయాలన్నారు. తగినన్ని మొబైల్‌ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని నిరంతరం పారిశుద్ద్య ఏర్పట్లను పర్యవేక్షించాలని మున్సిపల్‌ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply