బీజేపీ శిక్షణ తరగతులు పూర్తి..
చెన్నూర్, ఆంధ్రప్రభ : గత రెండురోజులుగా స్థానికంగా జరుగుతున్నా భారతీయ జనతాపార్టీ మూడు మండలాల పార్టీ శ్రేణుల శిక్షణ తరగుతులు నేటి తో పూర్తి అయ్యాయి. పట్టణ బీజేపీ అధ్యక్షులు తుమ్మ శ్రీపాల్ అధ్యక్షతన (21 ,22) తేదీలలో జరగబోయే పండిత్ దీనదయాళ్ గారి ప్రశిక్షణ తరగతులని చెన్నూరు పట్టణ సాయిరాం ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేయడం జరిగింది అని ఈ శిక్షణ తరగతులలో ప్రతి ఒక్క బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని జిల్లా బిజెపి అధ్యక్షులు నగునూరీ వెంకటేశ్వర్ గౌడ్ కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ ,జిల్లా బిజెపి కార్యదర్శి రత్న లక్ష్మీనారాయణ ,చెన్నూరు రూరల్ అధ్యక్షులు బుర్ర రాజశేఖర్ గౌడ్, కోటపల్లి మండల అధ్యక్షులు పెద్దింటి పున్న,భీమారం ప్రెసిడెంట్ శంకర్,పట్టణ బీజేపీ కౌన్సిలర్లు గర్రెపల్లి వెంకట నర్సయ్య శాంత కుమారి ,ఏతం శివకృష్ణ ,మాజీ పట్టణ బీజేపీ అధ్యక్షులు జాడి తిరుపతి , పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి కాయిత వెంకటేష్,మానిక రౌత్ శంకర్ ,జిల్లా బిజెపి సభ్యులు తలారి రాజయ్య,ముత్యాల శ్రావణి , మంత్రి రామయ్య ,ఖాజా షఫీ , తగరం మధు రాజ్ , చాకటి శ్యామ్, ఆలం బాపు , అదే విధంగా తదితర చెన్నూరు పట్టణ మరియు రూరల్ , కోటపల్లి,బీమారం మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
