జనగణన ప్రక్రియలో ఖచ్చితత్వం కీలకం…
జనగణన ప్రక్రియలో ఖచ్చితత్వం కీలకం…
3 రోజుల పాటు టెక్నికల్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ అర్బన్, ఆంధ్రప్రభ : జనగణన దేశ అభివృద్ధికి ముఖ్యమైన ప్రాథమిక సమాచార సేకరణ ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఆదివారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జనగణన – 2027 ఫేస్ – 1 గృహాల జాబితా, గృహ గణన నిర్వహణలో భాగంగా నూతనంగా ఎంపికైన టెక్నికల్ అసిస్టెంట్లు, జనాభా లెక్కల ఛార్జ్ క్లర్క్ లకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై, నూతనంగా ఎంపికైన వారికి పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనగణన – 2027 ఫేస్ – 1 గృహాల జాబితా, గృహ గణన (HLO) కింద టెక్నికల్ అసిస్టెంట్, జనాభా లెక్కల ఛార్జ్ క్లర్క్ లకు శిక్షణ కార్యక్రమం నేటి నుంచి మూడు రోజుల (22 నుంచి 24) పాటు ఉంటుందని పేర్కొన్నారు. జనగణన దేశ అభివృద్ధికి ముఖ్యమైన ప్రాథమిక సమాచార సేకరణ ప్రక్రియ అని తెలిపారు.
ప్రతి వివరాన్ని ఖచ్చితంగా నమోదు చేసే విధానాన్ని, అలాగే టెక్నికల్ అసిస్టెంట్లు సాంకేతిక పరికరాల వినియోగంపై పూర్తి అవగాహన కల్పించాలని, డేటా సేకరణలో పారదర్శకతపై, ఇతర వివరాలపై మీరందరూ ఈ శిక్షణలో ప్రతి అంశాన్ని నిశితంగా వినాలని, బాగా నేర్చుకోవాలని ఆకాంక్షిస్తూ, శుభాకాంక్షలతో ప్రోత్సహించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో సీపీఓ చినకోట్యా నాయక్, శిక్షకులు రవి నాయక్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
