నర్సంపేట మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా డాక్టర్ సంధ్య బాధ్యతల స్వీకరణ

నర్సంపేట మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా డాక్టర్ సంధ్య బాధ్యతల స్వీకరణ

నర్సంపేట, ఆంధ్రప్రభ:
నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి నూతన ప్రిన్సిపల్‌గా డాక్టర్ సంధ్య నియమితులయ్యారు. మంగళవారం ఆమె అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సిబ్బంది ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఏడీ సాజిద్ అలీ, కార్యాలయ సూపరింటెండెంట్, టీఎన్‌జీఓ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎండీ మొయిజుద్దీన్, కార్యాలయ సూపరింటెండెంట్ రవీందర్ తదితరులు నూతన ప్రిన్సిపల్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్ సంధ్య మాట్లాడుతూ, మెడికల్ కాలేజీ అభివృద్ధి, వైద్య విద్యా ప్రమాణాల మెరుగుదలతో పాటు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

నూతన ప్రిన్సిపల్ నియామకంతో మెడికల్ కాలేజీతో పాటు అనుబంధ ఆస్పత్రి సేవలు మరింత మెరుగుపడతాయని సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply