మోదీ సభకు భారీగా తరలిన బీజేపీ శ్రేణులు..

మక్తల్, ఆంధ్రప్రభ ; ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలకడంతో పాటు ఛలో పరేడ్ గ్రౌండ్ సభకు నారాయణపేట జిల్లా మక్తల్ నుండి భారీగా బిజెపి శ్రేణులు తరలి వెళ్లారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బస్సులలో చలో పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభకు తరలివెల్లగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జి. బలరాం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కర్ని స్వామి, మక్తల్ అర్బన్ మండల అధ్యక్షులు బి. రాజశేఖర్ రెడ్డి జెండా ఊపి బస్సు ర్యాలీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారని అన్నారు .అందులో ప్రధానంగా పాలమూరు పార్లమెంటు పరిధిలో 300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారని అన్నారు. మహబూబ్నగర్ నుండి కర్ణాటక సరిహద్దు గుడెబల్లూరు వరకు నాలుగు లైన్ల 167 వ జాతీయ రహదారి విస్తరణ పనులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు వారు తెలిపారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి తెలంగాణకు వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ విజయవంతం కోసం పార్టీ శ్రేణులంతా భారీ ఎత్తున తరలి వెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సుకన్య శేఖర్ ,కావలి వెంకటేష్, వన్నవాడ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

Leave a Reply